Wednesday, September 2, 2009

హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించే మార్గం...

హైదరాబాద్ జనాభా 70 లక్షలు కు చేరుకోవటంతో నీటి సరఫరా మెదలుకొని విధ్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, రోడ్లు నిర్వహణ, ఉపాది కల్పన, నివాస గృహాలు, శాంతిబద్రతలు అన్ని రంగాలపైనా విపరీతమైన ఒత్తిడి.
ఈ ఒత్తడి తగ్గించాలంటే, హైదరాబాద్ నగరాన్ని రెండుమార్గాలలో ఉన్న చిన్నపట్టణాలను
కలుపుతూ హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్...... నిర్మించటం ఒకమంచి మార్గము. చైనా, జపాన్, దక్షిణకొరియా దేశాలలో ఇలాంటి రైళ్ళు ఇప్పటికేనడుస్తున్నాయి. ఇవి గంటకు 350 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో బయలుదేరితే గుంటూరు కు గంట లోపే వెళ్ళవచ్చు(దూరం 311 కి.మీ)
రోజూ గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్దులు మొదలగువారికి అందుబాటులో ఉండేటట్లు టికెట్ ధరలు నిర్ణయిస్తే చాలు. ఈ విధమైన రైళ్ళు హైదరాబాద్ అనే కాదు మిగతా మహానగరాలైన ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై ఎక్కడ ఏర్పాటు చేసినా ఉపయేగాలు అద్బుతం గా ఉంటాయి. ఆయా నగరాలనుంచి ఒక 300 కి.మీ కు కాస్త అటు ఇటు గా చిన్న పట్టణాలను straight line లో కలుపుతూ మాత్రం వెళ్ళాలి.
దీని వలన మహా నగరాల జనాభాలో మార్పు లు రావటం, చిన్న పట్టణాల అభివృద్ది ఏకకాలం లో జరుగుతాయి.
ఉదాహరణకు హైదరాబాద్-గుంటూరు మార్గం తీసుకుంటే దారిలో నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి లాంటి వాటిని కలుపుతూ పోవాలి. ఈ పట్టణాలలో ఎక్కడ రైలు ఎక్కినా హైదరాబాద్ కు గంట లోపే చేరుకుంటారు.
హైదరాబాద్ తో పోలిస్తే ఈ పట్టణాలలో జీవనవ్యయం తక్కువ కాబట్టి కొంత జనాభా వలస రావటం వలన(కనీసం 4% లేక 5%) ఈ హైస్పీడ్ రైలు మార్గం విజయవంతమైనట్లే. ఎవరెవరు వలస వెళ్ళె అవకాశం ఉంది అని పరిశీలిస్తే .....
హైదరాబాద్ లో స్దిరపడ్డ ఆయా పట్టణాల, సమీప గ్రామాల ప్రజలు, మరియు మద్యతరగతి వర్గం, ఎగువ మద్య తరగతి వర్గం ప్రజలు. సానుకూల దృక్పదంతో ఆలోచిస్తే ఇది తప్పకుండా సాద్యపడుతుంది.

3 comments:

  1. Very good idea. Indeed it works out well. But running high speed trains is also a very costly affair. It may not be cost-effective for now, since the ticket charges would be high. But ultimately that is what the govt agencies and the general public may have to go for, keeping in mind the challenges that lie ahead.

    ReplyDelete