మెట్రోరైలు ...... అత్యంత ఖరీదైన వ్యవహారం, మొదట 8848 కోట్ల తో మొదలై ఇప్పుడు 12,500 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజక్టు ప్రారంభమయ్యేనాటికి ఎంతకెళుతుందో!! ముగిసేనాటికి (ప్రభుత్వాలు, కాంట్రాక్టర్ల దయవలన) ఇంకెంతకెళుతుందో!!! BRTS (బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం) గురించి కొందరు చెబుతున్నారు దానివలన రోడ్డు ప్రక్కన ఎక్కువ నిర్మాణాలు కూల్ఛవలసివస్తుంది అని నిపుణులు చెబుతున్నారు,ఈ BRTS నగరంలోఅంత విజయవంతంకాకపోవచ్చు, మరైతే హైదరాబాద్ లో ప్రజారవాణా పరిస్దితి ఏమిటి?
మెట్రోరైలు పద్దతిలోనే రోడ్డుమీద 10 మీటర్ల ఎత్తులో పిల్లర్ లు (స్తంబాలు) వేసి రైల్వే ట్రాక్ వేయటంకంటే... అలాంటి పిల్లర్ల పై వెడల్పు తక్కువగా ఉండే రోడ్డుని నిర్మించి (రెండు బస్సులు పక్క పక్క గా సౌకర్యంగా వెళ్ళేటట్లు) CNG (కంప్రెస్ డ్ నేచురల్ గ్యాస్) బస్సులను నడపటం చాలా సౌకర్యం, ప్రయేజనకారిగా ఉంటుంది. దీనికి మనము Flyover Bus Transport (FBT) అని పిలుచుకోవచ్చు
సందేహాలు - సమాదానాలు
1)మెట్రోరైలు కంటే Flyover Bus Transport ఏవిదంగా మెరుగైనది?
ans: a) ఆర్దికంగా మెరుగైనది మెట్రోరైలుకి సుమారు 12000-15000 కోట్లు రూపాయలు ఖర్ఛు అవుతుంది, దీనికి 5000 కోట్లు మించదనేది నా అభిప్రాయం
b)నిర్వహణా పరంగా మెరుగైనది, మెట్రోరైలు నిర్మాణం తర్వాత భారీ స్దాయిలో సాంకేతిక సిబ్బంది దాని నిర్వహణను చూడాల్సి ఉంటుంది, అదే FBT లో అయితే నేలమీద తిరిగే బస్సులు Flyover మీద తిరుగుతాయి, దానికి సాంకేతిక సిబ్బంది అవసరం ఉండదు.
2)ఈ రెండు రవాణా వ్యవస్దల మధ్య సేవల నాణ్యత, విసృతి ఎంత?
ans: Flyover Bus Transport వ్యవస్దలో బస్సులను గంటకు 60 కి.మీ వేగం తగ్గకుండా నడపవచ్చు, ఏవిదమైన ఆటంకాలు ఉండవు మెట్రోరైలు లాగానే. ఇక సేవల విసృతి లో పాతబస్తీ తో సహా ఎక్కడంటే అక్కడ ఈ Flyover Bus Transport ని నిర్మించు కోవచ్చు, మెట్రోరైలు లాగ 2 లేక 3 మార్గాలకే పరిమితం అవనక్కర్లేదు.
3)ఈ Flyover Bus Transport కు స్పూర్తి ఏమిటి?
ans: మలేషియా లోని కౌలాలంపూర్ సిటీ లో Lite Rail Transit (LRT) అనే వ్యవస్ద ఉంది, మామూలు రైళ్ళకూ, మెట్రో రైళ్ళు కూ మద్యస్దం గా ఉంటుంది, ఇక్కడ LRT రైళ్ళన్నీFlyover మీదనే తిరుగుతాయి, హైదరాబాద్ లో ట్రాక్ బదులు రోడ్డును నిర్మిస్తాము అంతే తేడా.
Saturday, November 7, 2009
Wednesday, September 2, 2009
"ఈనాడు" వాళ్ళు భయపడుతున్నారా!
ముఖ్యమంత్రి కనిపించకుండా పోయారని ఆందోళన పడుతున్న ప్రజలకు, తాజా వార్తలకోసం "ఈ-నాడు" ఇంటర్ నెట్ పేపర్ లో చూస్తే దర్శనమే ఇవ్వటలేదు. అధక తాకిడి అని సమర్దించుకున్నా వేస్టు. ఎందుకంటే, "సాక్షి" చాలా తొందరగా ఓపెన్ అవుతుంది, గ్రేట్ ఆంద్ర వెబ్ సైట్ కూడా ఫర్వాలేదు. వీళ్ళకూ, వాళ్ళకూ పడదు కదా.... అందుకే ఏం రాస్తే.... ఏంముంచుకొస్తుందో అని భయపడుతున్నట్లు ఉన్నారు. యాజమాన్యమే పేపర్ display కాకుండా ఆపి ఉండొచ్చు. పిరికి వాళ్ళు! !
హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించే మార్గం...
హైదరాబాద్ జనాభా 70 లక్షలు కు చేరుకోవటంతో నీటి సరఫరా మెదలుకొని విధ్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, రోడ్లు నిర్వహణ, ఉపాది కల్పన, నివాస గృహాలు, శాంతిబద్రతలు అన్ని రంగాలపైనా విపరీతమైన ఒత్తిడి.
ఈ ఒత్తడి తగ్గించాలంటే, హైదరాబాద్ నగరాన్ని రెండుమార్గాలలో ఉన్న చిన్నపట్టణాలను
కలుపుతూ హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్...... నిర్మించటం ఒకమంచి మార్గము. చైనా, జపాన్, దక్షిణకొరియా దేశాలలో ఇలాంటి రైళ్ళు ఇప్పటికేనడుస్తున్నాయి. ఇవి గంటకు 350 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో బయలుదేరితే గుంటూరు కు గంట లోపే వెళ్ళవచ్చు(దూరం 311 కి.మీ)
రోజూ గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్దులు మొదలగువారికి అందుబాటులో ఉండేటట్లు టికెట్ ధరలు నిర్ణయిస్తే చాలు. ఈ విధమైన రైళ్ళు హైదరాబాద్ అనే కాదు మిగతా మహానగరాలైన ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై ఎక్కడ ఏర్పాటు చేసినా ఉపయేగాలు అద్బుతం గా ఉంటాయి. ఆయా నగరాలనుంచి ఒక 300 కి.మీ కు కాస్త అటు ఇటు గా చిన్న పట్టణాలను straight line లో కలుపుతూ మాత్రం వెళ్ళాలి.
దీని వలన మహా నగరాల జనాభాలో మార్పు లు రావటం, చిన్న పట్టణాల అభివృద్ది ఏకకాలం లో జరుగుతాయి.
ఉదాహరణకు హైదరాబాద్-గుంటూరు మార్గం తీసుకుంటే దారిలో నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి లాంటి వాటిని కలుపుతూ పోవాలి. ఈ పట్టణాలలో ఎక్కడ రైలు ఎక్కినా హైదరాబాద్ కు గంట లోపే చేరుకుంటారు.
హైదరాబాద్ తో పోలిస్తే ఈ పట్టణాలలో జీవనవ్యయం తక్కువ కాబట్టి కొంత జనాభా వలస రావటం వలన(కనీసం 4% లేక 5%) ఈ హైస్పీడ్ రైలు మార్గం విజయవంతమైనట్లే. ఎవరెవరు వలస వెళ్ళె అవకాశం ఉంది అని పరిశీలిస్తే .....
హైదరాబాద్ లో స్దిరపడ్డ ఆయా పట్టణాల, సమీప గ్రామాల ప్రజలు, మరియు మద్యతరగతి వర్గం, ఎగువ మద్య తరగతి వర్గం ప్రజలు. సానుకూల దృక్పదంతో ఆలోచిస్తే ఇది తప్పకుండా సాద్యపడుతుంది.

Wednesday, August 26, 2009
బ్లాగ్ మిత్రులకు విజ్ఞప్తి!
హైదరాబాద్ లో ఉన్న, చెట్ల సంరక్షణ కు సంబందించి మీకు తెలిసిన స్వచ్చంద సంస్దలు అడ్రస్ తెలియచేయగలరు.
Sunday, August 23, 2009
పాపం.....రాజ్య సభ
అవును! మనుము(బారతీయ వోటర్లం) దౌర్బాగ్యపు రాజకీయాల ను చూసీచూడనట్లు ఉండటం వల్లనే ఈ స్దితి లో(అభివృద్ది లేమి, అవినీతి, వివక్ష) ఉన్నాము. ఇలా ఎందుకు అనాల్సివచ్చినిదంటే, ఒక వారం, పది రోజుల క్రిందట మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ పెద్దల సభకు ఎంపికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం సందర్బం గా చక్రాల కుర్ఛీలో పార్లమెంట్ రావటం ఒకటి, ప్రమాణ పత్రామును మరొక సభ్యడు చదవటం, ఆయన కేవలం చక్రాల కుర్ఛీలో కూర్చోవడానికే పరిమితమయ్యారు. ప్రమాణం పూర్తయ్యాకా పార్టీలకతీతంగా సభ్యలంతా బల్లలు చరిచి హర్శాతిరేకాలు వ్యక్తం చేసారంట. ఫెర్నాండేజ్ ప్రస్తుతం తీవ్రమయిన అనారోగ్యసమస్యలలో బాదపడుతున్నారు. డాక్టర్లు కూడా పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారు. ప్రస్తుత పరిస్దితులలో ఆయన రాజ్యసబలో జరిగే ఏ చర్చలోనూ పాల్గొనలేడన్నది సుస్పష్టం. లేచి నడవలేని, మాట్లాడలేని నాయకులను కనీసం పార్టీ సేవకైనా ఉపయేగించుకోవచ్చుకదా. జనం మీదకు తోలేయడం ఎంతవరకూ భావ్యం. ఆయన ఉన్న పార్టీ లో (జనతాదళ్(యు)) లో ఆరోగ్యం గా ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు కదా!
Saturday, August 22, 2009
చవితి శుభాకాంక్షలు
ఇందుమూలముగా యావన్మందికీ వినాయక చవితి శుభాకాంక్షలు, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి
మీ శ్రీను
మీ శ్రీను
Subscribe to:
Posts (Atom)